Faith

యెహోవా నా కాపరి నాకు లేమిలేదు

Yehovaa Naa Kaapari Naaku Lemiledu

Watch on YouTube
యెహోవా నా కాపరి నాకు లేమిలేదు పచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్ ||యెహోవా|| మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్ ||యెహోవా|| పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను ||యెహోవా|| నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నది ||యెహోవా|| చిరకాలము నేను ప్రభు మందిరములో వసియించెద నిరతం సంతసమొందెదను ||యెహోవా||