విజయ గీతముల్ పాడరే
క్రీస్తుకు జయ - విజయ గీతముల్ పాడరే (2)
వృజిన మంతటి మీద - విజయ మిచ్చెడు దేవ
నిజ కుమారుని నామమున్
హృదయములతో - భజన జేయుచు నిత్యమున్
||విజయ||
మంగళముగ యేసుడే
మనకు రక్షణ - శృంగమై మరి నిలచెను
నింగిన్ విడిచి వచ్చెను
శత్రుని యుద్ధ - రంగమందున గెల్చెను
రంగు మీరగదన - రక్త బలము వలన
పొంగు నణగ జేసెను
సాతానుని బల్ - కృంగ నలిపి చీల్చెను
||విజయ||
పాపముల్ దొలగింపను
మనలను దన స్వ - రూపంబునకు మార్పను
శాపం బంతయు నోర్చెను
దేవుని న్యాయ - కోపమున్ భరియించెను
పాపమెరుగని యేసు - పాపమై మనకొరకు
పాప యాగము దీర్చెను
దేవుని నీతిన్ - ధీరుడై నెరవేర్చెను
||విజయ||
సిలువ మరణము నొందియు
మనలను దనకై - గెలువన్ లేచిన వానికి
చెలువుగన్ విమలాత్ముని
ప్రేమను మనలో - నిలువన్ జేసిన వానికి
కొలువు జేతుమెగాని - ఇలను మరువక వాని
సిలువ మోయుచు నీ కృపా
రక్షణ చాల విలువ గలదని చాటుచు
||విజయ||
