Thanksgiving

విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా

Vijayasheeludaa Naa Praana Priyudaa

Watch on YouTube
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2) నా యేసయ్యా నిను వేడుకొనగా నా కార్యములన్నియు సఫలము చేసితివి (2) ||విజయశీలుడా|| అలసిన సమయమున - నా ప్రాణములో త్రాణ పుట్టించినావు (2) ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2) నిత్యానందము కలిగించె నీ శుభ వచనములతో - నెమ్మదినిచ్చితివి (2) ||విజయశీలుడా|| ఆశ్చర్యకరముగ - నీ బాహువు చాపి విడుదల కలిగించినావు (2) అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు (2) నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి వాగ్ధాన భూమిలో - చేర్చిన దేవా (2) ||విజయశీలుడా|| ఆరోగ్యకరమైన నీ - రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు (2) అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు (2) నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు (2) ||విజయశీలుడా||