Praise

విజయ గీతముల్ పాడరే

Vijaya Geethamul Paadare

Watch on YouTube
విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ - విజయ గీతముల్ పాడరే (2) వృజిన మంతటి మీద - విజయ మిచ్చెడు దేవ నిజ కుమారుని నామమున్ హృదయములతో - భజన జేయుచు నిత్యమున్ ||విజయ|| మంగళముగ యేసుడే మనకు రక్షణ - శృంగమై మరి నిలచెను నింగిన్ విడిచి వచ్చెను శత్రుని యుద్ధ - రంగమందున గెల్చెను రంగు మీరగదన - రక్త బలము వలన పొంగు నణగ జేసెను సాతానుని బల్ - కృంగ నలిపి చీల్చెను ||విజయ|| పాపముల్ దొలగింపను మనలను దన స్వ - రూపంబునకు మార్పను శాపం బంతయు నోర్చెను దేవుని న్యాయ - కోపమున్ భరియించెను పాపమెరుగని యేసు - పాపమై మనకొరకు పాప యాగము దీర్చెను దేవుని నీతిన్ - ధీరుడై నెరవేర్చెను ||విజయ|| సిలువ మరణము నొందియు మనలను దనకై - గెలువన్ లేచిన వానికి చెలువుగన్ విమలాత్ముని ప్రేమను మనలో - నిలువన్ జేసిన వానికి కొలువు జేతుమెగాని - ఇలను మరువక వాని సిలువ మోయుచు నీ కృపా రక్షణ చాల విలువ గలదని చాటుచు ||విజయ||