Worship

వర్ణించలేను వివరించలేను

Varninchalenu Vivarinchalenu

Watch on YouTube
వర్ణించలేను వివరించలేను అతి శ్రేష్టమైన నీ నామమున్ యేసు నీ నామమున్ (2) కొనియాడెదన్ కీర్తించెదన్ (2) అత్యంతమైన నీ ప్రేమను యేసు నీ ప్రేమను (2) ||వర్ణించలేను|| మహోన్నతుడ నీవే - పరిశుద్ధుడ నీవే పాపినేని చూడక ప్రేమించితివే (2) హల్లెలూయా హల్లెలూయా (2) అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| సర్వాధికారి సర్వోన్నతుడా (2) హీనుడైన నన్ను కరుణించితివే (2) హల్లెలూయా హల్లెలూయా (2) అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| రత్న వర్ణుడవు అతి సుందరుడవు (2) నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే (2) హల్లెలూయా హల్లెలూయా (2) అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను||