తరాలు మారినా యుగాలు మారినా
మారని దేవుడు మారని దేవుడు
మన యేసుడు
||తరాలు||
మారుచున్న లోకములో
దారి తెలియని లోకములో (2)
మారని దేవుడు మన యేసుడు (2)
||తరాలు||
సూర్యచంద్రులు గతించినా
భూమ్యాకాశముల్ నశించినా (2)
మారని దేవుడు మన యేసుడు (2)
||తరాలు||
నీతి న్యాయ కరుణతో
నిశ్చలమైన ప్రేమతో (2)
మారని దేవుడు మన యేసుడు (2)
||తరాలు||
నిన్న నేడు నిరంతరం
ఒకటైయున్న రూపము (2)
మారని దేవుడు మన యేసుడు (2)
||తరాలు||
