Encouragement

తలవంచకు నేస్తమా

Thalavanchaku Nesthamaa

Watch on YouTube
తలవంచకు నేస్తమా (2) తలవంచకు ఎప్పుడూ తలవంచకు ఎన్నడూ స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో కుడి ఎడమలకు బేధం తెలియని లోకంలో కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో నీవు కావాలి ఓ.. మాదిరి నీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణ నీవు మండాలి ఓ.. జ్వాలగా నీవు చేరాలి ఓ.. గమ్యము ||తలవంచకు|| చీకటిని వెనుకకు త్రోసి - సాగిపో ముందుకే క్రీస్తు బాటలో పయనిస్తే - ఎదురేమున్నది రేపటి భయం నిందల భారం - ఇకపై లేవులే క్రీస్తుని చేరు లోకాన్ని వీడు - విజయం నీదేలే (2) ||నీవు|| పెకిలించు కొండలను - విశ్వాస బాటలో గెలవాలి యుద్ధ రంగంలో - దైవిక బలంతో యేసుని కృప నీతోనే ఉంది - సాధించు ప్రగతిని మంచిని పెంచు ప్రేమను పంచు - నిలిచిపో జగతిలో (2) ||నీవు||