Faith

తమ దేవునెరుగువారు చేసెదరు

Thama Devuneruguvaaru Chesedharu

Watch on YouTube
తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు (2) ఇచ్చకపు మాటల వలన - అక్షయుని విడువరు (2) తప్పుబోధల నెప్పుడు తృణీకరించెదరు (2) ||తమ|| సత్యమును విడువరు - ఉత్తములుగా నడిచెదరు (2) అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు (2) ||తమ|| మనుజ భయము జెందరు - మాన్యులై యుండెదరు (2) మంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు (2) ||తమ|| ద్వేషించెదరు విగ్రహముల్ - శిరములు ఖండించినను (2) పర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు (2) ||తమ|| అగ్నిలో వేయబడినను - విఘ్నంబులు కలిగినను (2) సింహపు బోనులో వేసినను సిగ్గునొందరు (2) ||తమ|| శోధనలను జయించెదరు - బాధలను సహించెదరు (2) నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు (2) ||తమ|| అదిక జ్ఞానమును పొంది - తగ్గించుకొనెదరు తామే (2) యేసు ప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు (2) ||తమ||