Evangelism

సుందరములు అతి సుందరములు

Sundaramulu Athi Sundaramulu

Watch on YouTube
సుందరములు అతి సుందరములు సువార్త మోసిన పాదములు అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు ప్రభు ప్రేమను చాటిన పెదవులు (2) ఏ లేమికి కలత చెందరు - ఏ నలతకు తలలు వంచరు ప్రభు సేవలో ధీరులు వీరు - తన చిత్తము ఎరిగిన వారు (2) యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు (2) తమ సిలువను ఎత్తుకొని - ప్రభు బోధను పాటించారు ప్రభు చిత్తము నెరవేర్చి - తన సన్నిధినే చేరారు (2) ||ఏ లేమికి|| లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వారు తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు (2) తమ దేహము యాగముగా - శోధనలు జయించినారు తమ సాక్ష్యము పెంచుకొని - ప్రభు రక్షణను పంచారు (2) ||ఏ లేమికి||