సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2)
||సుమధుర||
ఎడారి త్రోవలో నే నడచినా - ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
నీవే నీవే నా ఆనందము
(నీవే) నీవే నా ఆధారము (2)
||సుమధుర||
సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే నా జయగీతము
(నీవే) నీవే నా స్తుతిగీతము (2)
||సుమధుర||
వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే నా అతిశయము
(నీకే) నీకే నా ఆరాధన (2)
||సుమధుర||
