సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణం అరుణోదయం (2)
తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది (2)
||సుధా||
దివి రాజుగా భువికి దిగినాడని - రవి రాజుగా ఇలను మిగిలాడని (2)
నవలోక గగనాలు పిలిచాడని - పరలోక భవనాలు తెరిచాడని (2)
ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)
నిను పావగా - నిరుపేదగా - జన్మించగా - ఇల పండుగ (2)
||సుధా||
లోకాలలో పాప శోకాలలో - ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2)
క్షమ హృదయ సహనాలు సమపాలుగా - ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2)
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే
నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2)
ఆ జన్మమే - ఒక మర్మము - ఆ బంధమే - అనుబంధము (2)
||సుధా||
