Worship

సుమధుర స్వరముల గానాలతో

Sumadhura Swaramula Gaanaalatho

Watch on YouTube
సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| ఎడారి త్రోవలో నే నడచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే నా ఆనందము (నీవే) నీవే నా ఆధారము (2) ||సుమధుర|| సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే నా జయగీతము (నీవే) నీవే నా స్తుతిగీతము (2) ||సుమధుర|| వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే నా అతిశయము (నీకే) నీకే నా ఆరాధన (2) ||సుమధుర||