Praise

స్తుతించెదను స్తుతించెదను

Sthuthinchedanu Sthuthinchedanu

Watch on YouTube
స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము ||స్తుతించెదను|| ఉన్నత దేవుడు సర్వాధిపతియు - ఉర్వి పరిపాలక (2) ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన - ఉత్తమ స్నేహితుని (2) ఉదయం సంధ్యా ఎల్లప్పుడును - ఉత్సాహ ధ్వనితో పాడెదను (2) ||స్తుతించెదను|| నాశనకరమైన పాప గుంట నుండి - నరక వేదన నుండి (2) నన్ను విడిపించి నిలిపిన దేవా - నిర్మల స్వరూప (2) నీతి సమాధానం సంతోషముతో - నిత్య జీవము నాకిచ్చితివి (2) ||స్తుతించెదను|| పాపము క్షమించి రోగము బాపి - భయమును దీర్చి (2) పవిత్రదాయక పావన మూర్తి - పరిశుద్ధ మిచ్చిన (2) పరమ పాదం శరణ్యం నాకు - పరమ రాజా పుణ్య దేవా (2) ||స్తుతించెదను|| తల్లి గర్భమునకు ముందేర్పరచి - దేహము నమర్చియును (2) దక్షిణ బాహుతో పట్టుకొనిన - దయా సంపూర్ణుడా (2) దిక్కు జయము ఆదరణయు - దయతో అనుగ్రహించితివి (2) ||స్తుతించెదను|| సిలువనెత్తి శ్రమలు సహించి - సేవకు పిలచిన (2) స్నేహ దర్శక వీర యోధ - సంశయ హారకా (2) శ్రమలు నింద ఆకలియైన - నీ స్నేహమునుండి ఎడబాపునా (2) ||స్తుతించెదను||