Worship

స్తుతించెదను - నిన్ను నేను మనసారా

Sthuthinchedanu - Ninnu Nenu Manasaaraa

Watch on YouTube
స్తుతించెదను - నిన్ను నేను మనసారా భజించెదను - నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీ కర్పించెదను (2) ||స్తుతించెదను|| పూజార్హుడవు పవిత్రుడవు పాపిని క్షమియించె మిత్రుడవు (2) పరము చేర్చి ఫలములిచ్చె పావనుడగు మా ప్రభువు నీవే (2) ||స్తుతించెదను|| కృపా కనికరములు గల దేవా కరుణ జూపి కనికరించు (2) కంటి రెప్ప వలె కాపాడు కడవరకు మమ్ము కావుమయ్య (2) ||స్తుతించెదను|| సర్వశక్తి గల మా ప్రభువా సజీవ సాక్షిగా చేయుమయా (2) స్థిరపరచి మమ్ము బలపరుచు సదా నీకే స్తోత్రాలర్పింతును (2) ||స్తుతించెదను||