స్తుతించెదను స్తుతించెదను
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము
||స్తుతించెదను||
ఉన్నత దేవుడు సర్వాధిపతియు - ఉర్వి పరిపాలక (2)
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన - ఉత్తమ స్నేహితుని (2)
ఉదయం సంధ్యా ఎల్లప్పుడును - ఉత్సాహ ధ్వనితో పాడెదను (2)
||స్తుతించెదను||
నాశనకరమైన పాప గుంట నుండి - నరక వేదన నుండి (2)
నన్ను విడిపించి నిలిపిన దేవా - నిర్మల స్వరూప (2)
నీతి సమాధానం సంతోషముతో - నిత్య జీవము నాకిచ్చితివి (2)
||స్తుతించెదను||
పాపము క్షమించి రోగము బాపి - భయమును దీర్చి (2)
పవిత్రదాయక పావన మూర్తి - పరిశుద్ధ మిచ్చిన (2)
పరమ పాదం శరణ్యం నాకు - పరమ రాజా పుణ్య దేవా (2)
||స్తుతించెదను||
తల్లి గర్భమునకు ముందేర్పరచి - దేహము నమర్చియును (2)
దక్షిణ బాహుతో పట్టుకొనిన - దయా సంపూర్ణుడా (2)
దిక్కు జయము ఆదరణయు - దయతో అనుగ్రహించితివి (2)
||స్తుతించెదను||
సిలువనెత్తి శ్రమలు సహించి - సేవకు పిలచిన (2)
స్నేహ దర్శక వీర యోధ - సంశయ హారకా (2)
శ్రమలు నింద ఆకలియైన - నీ స్నేహమునుండి ఎడబాపునా (2)
||స్తుతించెదను||
