Good Friday
సిలువలో నీ ప్రేమ - పాపము తీసేనయ్యా
Siluvalo Nee Prema - Paapamu Theesenayyaa
సిలువలో నీ ప్రేమ - పాపము తీసేనయ్యా
మరణము చెరలో నుండి - నను విడిపించేనయ్యా (2)
ఘోర పాపిని నేను - పరిశుద్ధుని చేసితివి
నిత్యజీవములో నన్ను - నిలుపుటకు బలి అయితివి (2)
||సిలువలో||
తాళలేని నీ తాపం - తొలగించెను నాదు శాపం
నలిగినట్టి నీ రూపం - ఇచ్చేను నాకు స్వరూపం (2)
నను విడిపించుటకు - విలువను విడిచితివి
పరమును చేర్చుటకు - మహిమను మరిచితివి (2)
||ఘోర పాపిని||
దైవ తనయుని దేహం - మోసింది చేయని నేరం
కడిగేందుకు నా దోషం - చిందించె నిలువునా రుధిరం (2)
నను కాపాడుటకు - రొట్టెగా విరిగితివి
మరణము దాటుటకు - బలిగా మారితివి (2)
||ఘోర పాపిని||
అధముడయినట్టి నేను - నీ ప్రేమ అర్హుడను కాను
పొగిడి నిన్ను ప్రతి క్షణము - తీర్చలేను నీ ఋణము (2)
నిను చాటించుటకు - వెలుగై సాగెదను
ప్రేమను పంచుటకై - ఉప్పుగ నిలిచెదను (2)
||ఘోర పాపిని||
