సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)
వెలి అయిన యేసయ్యా - బలి అయిన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా - నీవెంతో అలసితివా
||సిలువలో||
నేరము చేయని నీవు - ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ- మోయలేక మోసావు (2)
కొరడాలు చెల్లని చీల్చెనే - నీ సుందర దేహమునే (2)
తడిపెను నీ తనువునే - రుధిరంబు ధారలే (2)
||వెలి||
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను (2)
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా (2)
||వెలి||
నాదు పాప భారం - నిను సిలువకు గురి చేసెనే
నాదు దోషమే నిన్ను - అణువణువున హింసించెనే (2)
నీవు కార్చిన రక్త ధారలే - నా రక్షణకాధారం (2)
సిలువలో చేరెదన్ - విరిగిన హృదయముతోను (2)
||వెలి||
