Good Friday

సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల

Siluvalo Bali Ayina Devuni Gorrepilla

Watch on YouTube
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు (2) ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి (2) కాదు కాదయ్యయ్యో నా పాప ఋణమునకే (2) ||సిలువలో|| నా అతిక్రమములకై నలుగ గొట్టబడి (2) నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2) ||సిలువలో|| మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత (2) సురూపము లేక సోలిపోతివ ప్రియుడా (2) ||సిలువలో||