Prayer

శాశ్వతమా ఈ దేహం

Shaashwathamaa Ee Deham

Watch on YouTube
శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా (2) క్షణికమైన ఈ మనుగడలో పరుగులేలనో అనుక్షణము నీటిపైన చిరు బుడగ వోలె (2) దేహము ఏ వేళా చితికిపోవునో ||శాశ్వతమా|| ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనవి తీరేనా నీ తనువే రాలిపోయినా (2) నీ గతి ఏమో నీకు తెలియునా ||శాశ్వతమా|| దేహ వాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి నీతి మార్గమున నడుచుకొందువో (2) చిరజీవముతో తరియించేవు ||శాశ్వతమా||