Second Coming

సీయోనులో స్థిరమైన

Seeyonulo Sthiramaina

Watch on YouTube
నీతోనే నా నివాసము - నిత్యము ఆనందమే సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము - నిత్యము ఆనందమే సీయోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2) సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని (2) ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో|| కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితి గతులు దరికే రాని (2) సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో|| సంఘ ప్రతిరూపము - పరమ యెరుషలేము (2) సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును (2) నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3) ఆనందమే పరమానందమే (10)