Worship
సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై
Seeyonulo Nundi Neevu Prakaashinchuchunnaavu Naapai
సీయోనులో నుండి నీవు - ప్రకాశించుచున్నావు నాపై (2)
సమాధానమై - సదాకాలము నను నీతో
నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2)
నిర్దోషమైన మార్గములో - నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2)
నీ సన్నిధిలో నను నిలిపి - ఉన్నత విజయమునిచ్చితివి (2)
నీ ఆశలు నెరవేరుటకు - నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు
||సీయోనులో||
నాయందు దృష్టి నిలిపి - నీ స్నేహబంధముతో ఆకర్షించి (2)
కృపావరములతో నను నింపి - సత్యసాక్షిగా మార్చితివి (2)
నీ మనస్సును పొందుకొని - నీ ప్రేమను నింపుకొని
కీర్తించెదను ప్రతినిత్యం
నిను ఆరాధింతును అనుక్షణము
||సీయోనులో||
నీ దివ్యమైన మహిమను - పరలోకమందునే చూచెదను (2)
నీ కౌగిలిలో చేర్చుకొని - ప్రతి భాష్పబిందువును తుడిచెదవు (2)
నీ మాటల మకరందమును - మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను
||సీయోనులో||
