Christmas

సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి

Santhoshinchudi Yandaru Naatho Santhoshinchudi

Watch on YouTube
సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని సంతోషించుడి నాతో సంతోషించుడి ||సంతోషించుడి|| అంధకార మయమైన భూమి నా ద్యంతము వెలిగింప - దాని యా-వేశము దొలఁగింప వందితుండు క్రీస్తేసు నాథుడు - వచ్చె బ్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతోషించుడి|| కాన నంధకారంబు దొలఁగఁ ప్ర కాశించెను లెండు - మీరు ప్ర-కాశింపను రెండు మానవులను సంతోష పర్చనై - మహిని నవతరించె భక్తుల మనము సంతసించె ||సంతోషించుడి|| మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించె - హృదయములఁ - దగుల ప్రకాశించె మున్ను జేయబడిన వాగ్ధత్థము - తిన్నగ నెరవేరే భక్తుల కన్ను లాస దీరె ||సంతోషించుడి|| ప్రీతియైన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను - గలసికొని - నాతో పాడుచును నీ తరి దూరస్థుల-కీ వార్తను - నే తీరును నైనఁ దెలుపఁగ నాతురపడవలెను ||సంతోషించుడి|| పాపులపై దేవునికి గలిగిన ప్రబలమైన దయను - లోకమునఁ - జూపింపఁ గవలెను జూపక పోయిన లోపము మనపై - మోపబడును నిజము వేగము జూపుద మా పథము ||సంతోషించుడి||