Thanksgiving
సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు
Santhosha Vasthram Maaku Dhariyimpajesaavu
సంతోషం యేసు వందనం
నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై
సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు
మా దుఃఖ దినములు సమాప్తపరచావు (2)
సంతోషం యేసు వందనం
నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై
స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం
మా దేవా నీకే అర్పితం
||సంతోష||
నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో
దీవెన కలదు నీ ప్రతి మాటలో (2)
విడువను ఎడబాయనని
వాగ్ధానమిచ్చి బలపరచావు (2)
||సంతోషం||
రక్షణ ఆనందం మాకిచ్చావు
మా క్రయ ధనమంతా చెల్లించావు (2)
ఏ తెగులు నీ గుడారమును
సమీపించదని సెలవిచ్చావు (2)
||సంతోషం||
