సంతోష గీతం పాడెదను
యేసూ నీ ఘనతను చాటెదను (2)
స్తోత్రము చెల్లింతును
నీ కీర్తి వినిపింతును (2)
||సంతోష||
నా ప్రార్దన నీవెపుడు - త్రోసివేయలేదు
నా యెద్ద నుండి నీ కృపను - తీసివేయలేదు (2)
నా విజ్ఞాపన అలించావు
నా మనవి అంగీకరించవు (2)
||సంతోష||
సమృద్ది ఉన్న ప్రాంతానికి - నన్ను చేర్చినావు
తొట్రల్లకుండ స్తిరముగను - నిలువబెట్టినావు (2)
నను బాగుగ పరిశీలించావు
నిర్మలునిగా రూపొందించావు (2)
||సంతోష||
