సజీవుడవైన యేసయ్యా
నిన్నాశ్రయించిన నీ వారికి
సహాయుడవై తృప్తి పరచితివే
సముద్రమంత సమృద్ధితో (2)
ఆనందించెద నీలో - అనుదినము కృప పొంది
ఆరాధించెద నిన్నే - ఆనంద ధ్వనులతో (2)
ధన రాసులే ఇలా - ధనవంతులకు - ఈ లోక భాగ్యము
దాచిన మేలులెన్నో - దయచేసినావే - ఇహ పరమున నాకు (2)
శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి
శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2)
||సజీవుడవైన||
క్షేమము నొందుటయే - సర్వ జనులకు - ప్రయాసగా మారే
క్షేమాధారము నీవై - దీర్ఘాయువుతో - సంతృప్తి పరతువు నన్ను (2)
నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే
నిత్యమైన నీ సత్య వాక్యముతో (2)
||సజీవుడవైన||
నలువది ఏండ్లు - నీ స్వాస్థ్యమును - మోసినది నీవే
నీ కృప కాంతిలో - నా చేయి విడువక - నడిపించుచున్నది నీవే (2)
పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే
పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2)
||సజీవుడవైన||
