Evangelism

సందేహమేల సంశయమదేల

Sandehamela Samshayamadela

Watch on YouTube
సందేహమేల సంశయమదేల ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల|| ఆ ముళ్ల మకుటము నీకై - ధరియించెనే నీ పాప శిక్షను తానే - భరియించెనే (2) ప్రవహించె రక్త ధార నీ కోసమే కడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల|| ఎందాక యేసుని నీవు - ఎరగనందువు ఎందాక హృదయము బయట - నిలవమందువు (2) యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహమేల|| ఈ లోక భోగములను - వీడజాలవా సాతాను బంధకమందు - సంతసింతువా (2) యేసయ్య సహనముతోనే చెలగాటమా ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2) ||సందేహమేల|| లోకాన ఎవ్వరు నీకై - మరణించరు నీ శిక్షలను భరియింప - సహియించరు (2) నీ తల్లియైన గాని నిన్ను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2) ||సందేహమేల||