Thanksgiving
సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
Sannuthinthu Yesu Swami Ninnu Anudhinam
సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
నీ మహాత్య కార్యములను పాడి వివరింతును (2)
శోధన వేదన కష్ట సమయాన - నా తోడుగా నుందువు
ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు - ఎన్నడు మరువను
||సన్నుతింతు||
సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు (2)
నా దోషములన్నిటిని క్షమియించినావు - కరుణ సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరచావు - నీకేమి చెల్లింతును
||సన్నుతింతును||
మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును
శాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును (2)
అడిగిన వారికి కాదనకుండ వరములు కురిపించును
యేసయ్య నీ గొప్ప నామము స్మరియింప - నాకెంతో భాగ్యము
||సన్నుతింతును||
