సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2)
||సందేహమేల||
ఆ ముళ్ల మకుటము నీకై - ధరియించెనే
నీ పాప శిక్షను తానే - భరియించెనే (2)
ప్రవహించె రక్త ధార నీ కోసమే
కడు ఘోర హింసనొందె నీ కోసమే (2)
||సందేహమేల||
ఎందాక యేసుని నీవు - ఎరగనందువు
ఎందాక హృదయము బయట - నిలవమందువు (2)
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2)
||సందేహమేల||
ఈ లోక భోగములను - వీడజాలవా
సాతాను బంధకమందు - సంతసింతువా (2)
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2)
||సందేహమేల||
లోకాన ఎవ్వరు నీకై - మరణించరు
నీ శిక్షలను భరియింప - సహియించరు (2)
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2)
||సందేహమేల||
