Thanksgiving

సజీవుడవైన యేసయ్యా

Sajeevudavaina Yesayyaa

Watch on YouTube
సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో (2) ఆనందించెద నీలో - అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే - ఆనంద ధ్వనులతో (2) ధన రాసులే ఇలా - ధనవంతులకు - ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో - దయచేసినావే - ఇహ పరమున నాకు (2) శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన|| క్షేమము నొందుటయే - సర్వ జనులకు - ప్రయాసగా మారే క్షేమాధారము నీవై - దీర్ఘాయువుతో - సంతృప్తి పరతువు నన్ను (2) నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన నీ సత్య వాక్యముతో (2) ||సజీవుడవైన|| నలువది ఏండ్లు - నీ స్వాస్థ్యమును - మోసినది నీవే నీ కృప కాంతిలో - నా చేయి విడువక - నడిపించుచున్నది నీవే (2) పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2) ||సజీవుడవైన||