అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా...
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు - ఎంత మనోహరము
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు - ఎంత మనోహరము
అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా...
పరిమళము - పరిమళ తైలము - (2)
||సహోదరులు||
సంఘ సహవాసములో సహోదరులు
మత్సరము ద్వేషము అసూయతో నిండి (2)
వాక్యమును విడచి ఐక్యత లోపించి
తొలగిపోయిరి... ప్రభు కృప నుండి
సహవాసము పరిహాసమాయెను - (2)
||సహోదరులు||
సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి
స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2)
క్షయమైన వాటి కొరకు - అక్షయుడగు ప్రభును వదిలి
అపహసించిరి... సువార్త సేవను
పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను - (2)
||సహోదరులు||
