Faith

సాగేను నా జీవ నావ

Saagenu Naa Jeeva Naava

Watch on YouTube
సాగేను నా జీవ నావ దొరికేను ఓ ప్రేమ త్రోవ నా యేసు పయనించు దారదీ కల్వరిగిరి చేరే త్రోవదీ ఆ....ఆ....ఆ.... ||సాగేను|| నేనెవరో నేనెరుగని తరుణంలో నా ఉనికిని యేర్పరచిన నాథుడు విశ్వాసపు నా జీవనతీరంలో ప్రేమ కెరటమై వచ్చెను యేసుడు ఆ....ఆ....ఆ.... ||సాగేను|| తన రక్త ధారలను ప్రోక్షించి నా హృదిలో పాపము తొలగించెను అనురాగ రసరమ్య గీతిక నా హృదిలో ప్రేమను వెలిగించెను ఆ....ఆ....ఆ.... ||సాగేను|| ప్రభు పనిలో బలమైన యోధులుగా ప్రతిచోటను నమ్మకముగా ఉండుటకు నీవిచ్చిన తలాంతులను ప్రతిచోట వాడుటకు మమ్మును బలపరచుము ఆ....ఆ....ఆ.... ||సాగేను||