Encouragement

సాగేటి ఈ జీవ యాత్రలో

Saageti Ee Jeeva Yaathralo

Watch on YouTube
సాగేటి ఈ జీవ యాత్రలో రేగేను పెను తుఫానులెన్నో (2) ఆదరించవా నీ జీవ వాక్కుతో సేదదీర్చవా నీ చేతి స్పర్శతో (2) యేసయ్యా.. ఓ మెసయ్యా హల్లెలూయా నీకే స్తోత్రమయా (2) ||సాగేటి|| సుడి గాలులెన్నో లోక సాగరాన వడిగా నను లాగి పడద్రోసే సమయాన (2) నడిపించగలిగిన నా చుక్కాని నీవే (2) విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే (2) ||యేసయ్యా|| వడ గాటులెన్నో నా పయనములోన నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన (2) తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే (2) కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే (2) ||యేసయ్యా|| అలల శ్రమలెన్నో బ్రతుకు నావపైన చెలరేగి విలవిలలాడించే సమయాన (2) నిలబెట్టి బలపరిచే బలవంతుడ నీవే (2) కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే (2) ||యేసయ్యా||