రక్షకుండుదయించినాడట - మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు - రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని - రీక్షణ ఫల మొందెదము
||రక్షకుండు||
దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)
దేవుడగు యెహోవా మన - దిక్కు దేరి చూచినాడు
||రక్షకుండు||
గగనము నుండి డిగ్గి - ఘనుడు గాబ్రియేలు దూత (2)
తగినట్టు చెప్పే వారికి - మిగుల సంతోష వార్త
||రక్షకుండు||
వర్తమానము జెప్పి దూత - వైభవమున పోవుచున్నాడు (2)
కర్తను జూచిన వెనుక - కాంతుము విశ్రమం బప్పుడు
||రక్షకుండు||
పశువుల తొట్టిలోన - భాసిల్లు వస్త్రముల జుట్టి (2)
శిశువును గనుగొందురని - శీఘ్రముగను దూత తెల్పె
||రక్షకుండు||
అనుచు గొల్ల లొకరి కొకరు - ఆనవాలు జెప్పుకొనుచు (2)
అనుమతించి కడకు క్రీస్తు - నందరికినీ దెల్పినారు
||రక్షకుండు||
