రక్షింపబడిన నీవు - లోకాశలపైనే నీదు
గురి నిలిపి పయనిస్తున్నావా
రక్షకుని ఎరిగిన నీవు - తానెవరో తెలియదు నాకు
అన్నట్టు జీవిస్తున్నావా (2)
యేసే లేని నీ బ్రతుకులో
వెలుగే లేదని తెలుసుకో
యేసే లేని జీవితానికి
విలువే లేదని తెలుసుకో (2)
||రక్షింపబడిన||
మంటితోనే నిను చేసినా
కంటి పాపగా కాపాడెనే
మాటి మాటికి పడిపోయినా
శాశ్వత ప్రేమతో ప్రేమించెనే (2)
ఆ ప్రేమను కాదని - అవసరమే లేదని
ఈ లోకం నాదని - ప్రభు మార్గం విడచితివా
యేసే లేనిదే - పరలోకానికి
ప్రవేశం లేదనే - పరమార్ధం మరచితివా
||యేసే||
యేసులోనే నీ రక్షణ
యేసులోనే నిరీక్షణ
యేసులోనే క్షమాపణ
చేసుకో మరి ప్రక్షాళన (2)
ఎంతో ప్రేమను - నీపై చూపించెను
తన ప్రాణము సహితము - నీకై అర్పించెనుగా
ఇప్పటికైననూ - మార్చుకో మనస్సునూ
ప్రభువును చేరగా - వేగిరమే పరుగిడిరా
||యేసే||
