Christmas
రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్
Raare Raare O Janulaaraa Vegame Raarandoy
రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్
సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్ (2)
పాపాలు బాపునంట - రోగాలు తీర్చునంట
లోకాన పండగంట (2)
||రారే||
మనుషుల పాపము బాప మహిమనే వీడాడంట
మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్ (2)
మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులే
మహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్ (2)
||రారే||
రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగను
పాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు (2)
పాప భారము మోసి మరణ కోరలు విరచి
శాశ్వత జీవమునివ్వగ మరణము గెలిచాడోయ్ (2)
||రారే||
