Prayer

రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము

Raavayya Yesunaathaa Maa Rakshana Maargamu

Watch on YouTube
రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య|| నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబులన్నియు ఖండించుటకు ||రావయ్య|| మేర లేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు ||రావయ్య|| పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను మా పాపంబులన్నియు పారద్రోలుటకు ||రావయ్య|| అందమైన నీదు పరమానంద పురమందు మేమందరము జేరి యానందించుటకు ||రావయ్య||