Christmas

రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్

Raaraaju Puttaadoy Maa Raaju Puttaadoy

Watch on YouTube
రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్ సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్ (2) ఈ లోకమునకు రక్షకుడిగ పుట్టినాడండోయ్ మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే... ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయెనే, హోయ్... ||రారాజు|| వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగ మిన్నుల పండగ సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట పశువుల పాకలోన ఆ పసి బాలుడంట చెరగని స్నేహమై..... ||రారాజు|| మచ్చలేని ముత్యమల్లె పొడిసే సూరీడు మనసులో దీపమై దారి సూపు దేవుడు ప్రేమ పొంగు సంద్రమల్లె కంటికి రెప్పలా అందరి తోడునీడై మాయని మమతలా సల్లంగా సూడ యేసు ఇల వచ్చినాడంట వరముగ చేర యేసు పరమును వీడెనంట మరువని బంధమై..... ||రారాజు||