Second Coming

రారాజు వస్తున్నాడో

Raaraaju Vasthunnaado

Watch on YouTube
రారాజు వస్తున్నాడో జనులారా.. రాజ్యం తెస్తున్నాడో త్వరపడి వేగమే రండి ప్రియులారా.. ప్రభుని చేరగ రండి వస్తానన్న యేసు రాజు రాక మానునా తెస్తానన్న బహుమానం తేక మానునా (2) ||రారాజు|| పాపానికి జీతం రెండవ మరణం అది అగ్ని గుండము అందులో వేదన (2) మహిమకు యేసే మార్గము జీవము (2) అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకో నీ పాప పరిహారము (2) ||వస్తానన్న|| పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు (2) యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం యేసయ్య గాయాలు రక్షణకు మార్గం అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకో నీ పాప పరిహారము (2) ||వస్తానన్న|| కనురెప్ప పాటున కడబూర మ్రోగగా పరమున ఉందురు నమ్మిన వారందరు (2) నమ్మని వారందరు శ్రమల పాలవుతారు (2) అందుకే నమ్ముకో యేసయ్యను చేరుకో పరలోక రాజ్యంబును (2) ||వస్తానన్న||