రాకడనే రైలు బండి వస్తున్నది
రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది (2)
పరిశుద్ధులకందులో చోటున్నది (2)
మంచి చోటున్నది - భలే చోటున్నది
చక్కని సీటున్నది
||రాకడనే||
సత్యమనే చక్రములు దానికున్నవి
శాంతి అనెడి పైకప్పు దానికున్నది (2)
పాపములను క్షమియించే బ్రేకులున్నవి - బండికి బ్రేకులున్నవి
జీవమునకు మార్గమని కూయుచున్నది - కూత కూయుచున్నది
||రాకడనే||
ప్రతి దినము బైబిలును పఠియించుము
ప్రార్దననెడి విజ్ఞాపన వివరించుము - ప్రభుకి వివరించుము
ఎదురు వీచే గాలులనెడి వ్యాధి బాధలన్
సాతాను చిక్కులను యేసు రక్తమందు కడిగి
జయము పొందుము - పవిత్రుడవు కమ్ము
||రాకడనే||
తండ్రి కుమారాత్మలనే రైలు బండిది
ఇంజను డ్రైవరు పేరు యెహోవాండి (2)
పరిశుద్ధ ఆత్మ అనెడి గార్డు ఉన్నాడు - బండికి గార్డు ఉన్నాడు
సిలువ జెండా ఎత్తి చూపి బండి నిలుపుము - నీవు ప్రవేశించుము
||రాకడనే||
రక్షణనే టిక్కెట్టు దానికున్నది (2)
మారు మారుమనస్సు పొంది మీరు
ముందుకు రండి - టిక్కెట్టు కొనండి (2)
||రాకడనే||
పాపులున్న స్టేషనులో బండి ఆగదు (2)
పరిశుద్ధుల స్టేషనులో
బండి ఆగును - రైలు బండి ఆగును (2)
||రాకడనే||
