Second Coming

రాకడ సమయంలో కడబూర శబ్ధంతో

Raakada Samayamlo Kadaboora Shabdhamtho

Watch on YouTube
రాకడ సమయంలో - కడబూర శబ్ధంతో యేసుని చేరుకునే - విశ్వాసం నీకుందా? (2) రావయ్య యేసయ్య - వేగరావయ్యా రావయ్య యేసునాథా - వేగమెరావయ్యా (2) ||రాకడ|| యేసయ్య రాకడ సమయంలో ఎదురేగె రక్షణ నీకుందా? (2) లోకాశలపై విజయం నీకుందా? (2) ||రావయ్య|| ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? (2) యేసు ఆశించే దీన మనస్సుందా? (2) ||రావయ్య|| దినమంతా దేవుని సన్నధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2) యేసునాథునితో సహవాసం నీకుందా? (2) ||రావయ్య|| శ్రమలోన సహనం నీకుందా? స్తుతియించే నాలుక నీకుందా? (2) ఆత్మలకొరకైన భారం నీకుందా? (2) ||రావయ్య|| నీ పాత రోత జీవితము నీ పాప హృదయం మారిందా? (2) నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2) ||రావయ్య|| అన్నీటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా? (2) ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2) ||రావయ్య||