Worship

రాజాధి రాజా రారా

Raajaadhi Raajaa Raaraa

Watch on YouTube
రాజాధి రాజా రారా - రాజులకు రాజువై రారా రాజయేసు రాజ్యమేల రారా - రవికోటి తేజ యేసు రారా (2) ఓ... మేఘ వాహనంబు మీద వేగమే ఓ... మించు వైభవంబు తోడ వేగమే ||రాజాధి|| ఓ... భూజనంబులెల్ల తేరిచూడగా ఓ... నీ జనంబు స్వాగతంబునీయగా నీ రాజ్యస్థాపనంబు సేయ - భూరాజులెల్ల గూలిపోవ భూమి ఆకసంబు మారిపోవ - నీ మహా ప్రభావమున వేగ ||రాజాధి|| ఆ... ఆకసమున దూత లార్భటింపగా ఆ... ఆదిభక్త సంఘ సమేతంబుగా ఆకసంబు మధ్య వీధిలోన - ఏకమై మహాసభ జేయ యేసు నాధ! నీదు మహిమలోన - మాకదే మహానందమౌగ ||రాజాధి|| ఓ... పరమ యెరుషలేము పుణ్య సంఘమా ఓ... గొఱియపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా పరమ దూతలార! భక్తులారా! - పౌలపోస్తులారా! పెద్దలారా! గొఱియపిల్ల యేసురాజు పేర - క్రొత్త గీతమెత్తి పాడరారా ||రాజాధి||