Worship

రాజాధి రాజ రవి కోటి తేజ

Raajaadhi Raaja Ravi Koti Theja

Watch on YouTube
రాజాధి రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక (2) విడువని కృప నాలో స్థాపించెనే సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2) ||రాజాధి|| వర్ణనకందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును - నా కొరకే త్యాగము చేసి (2) కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను - నేను ప్రకటించెద (2) ||రాజాధి|| ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశములను - నా యెడల సఫలపరచి (2) ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్నా తోడెవ్వరు - లేరు ఈ ధరణిలో (2) ||రాజాధి|| మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును - నా కొరకే సిద్ధపరచితివి (2) నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడెద - స్తోత్ర సంకీర్తనలే (2) ||రాజాధి||