రాజాధి రాజా రారా - రాజులకు రాజువై రారా
రాజయేసు రాజ్యమేల రారా - రవికోటి తేజ యేసు రారా (2)
ఓ... మేఘ వాహనంబు మీద వేగమే
ఓ... మించు వైభవంబు తోడ వేగమే
||రాజాధి||
ఓ... భూజనంబులెల్ల తేరిచూడగా
ఓ... నీ జనంబు స్వాగతంబునీయగా
నీ రాజ్యస్థాపనంబు సేయ - భూరాజులెల్ల గూలిపోవ
భూమి ఆకసంబు మారిపోవ - నీ మహా ప్రభావమున వేగ
||రాజాధి||
ఆ... ఆకసమున దూత లార్భటింపగా
ఆ... ఆదిభక్త సంఘ సమేతంబుగా
ఆకసంబు మధ్య వీధిలోన - ఏకమై మహాసభ జేయ
యేసు నాధ! నీదు మహిమలోన - మాకదే మహానందమౌగ
||రాజాధి||
ఓ... పరమ యెరుషలేము పుణ్య సంఘమా
ఓ... గొఱియపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా
పరమ దూతలార! భక్తులారా! - పౌలపోస్తులారా! పెద్దలారా!
గొఱియపిల్ల యేసురాజు పేర - క్రొత్త గీతమెత్తి పాడరారా
||రాజాధి||
