రాజాధి రాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రాజ్య పరిపాలక (2)
విడువని కృప నాలో స్థాపించెనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2)
||రాజాధి||
వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును - నా కొరకే త్యాగము చేసి (2)
కృపా సత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను - నేను ప్రకటించెద (2)
||రాజాధి||
ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశములను - నా యెడల సఫలపరచి (2)
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీ కన్నా తోడెవ్వరు - లేరు ఈ ధరణిలో (2)
||రాజాధి||
మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును - నా కొరకే సిద్ధపరచితివి (2)
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద - స్తోత్ర సంకీర్తనలే (2)
||రాజాధి||
