Devotional

ప్రియ యేసు నిర్మించితివి

Priya Yesu Nirminchithivi

Watch on YouTube
ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసియించునా హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును (2) పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి (2) ||ప్రియ యేసు|| అజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి (2) కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి (2) ||ప్రియ యేసు|| వికసించె విశ్వాసంబు వాక్యంబును చదువగనే (2) చేరితి నీదు దారి కోరి నడిపించుము (2) ||ప్రియ యేసు|| ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు (2) ఆత్మాభిషేకమునిమ్ము ఆత్మీయ రూపుండా (2) ||ప్రియ యేసు||