ప్రభు యేసుని వదనములో - నా దేవుడు కనిపించె (2)
పాపాత్ముల బ్రోచుటకై - కృపలొలికిన కలువరిలో (2)
పరలోకముకై - చిర జీవముకై (2)
ప్రార్ధించెను నా హృదయం
||ప్రభు యేసుని||
దిశలన్నియు తిరిగితిని - నా పాపపు దాహముతో (2)
దౌష్ట్యములో మసలుచును - దౌర్జన్యము చేయుచును (2)
ధన పీడనతో - మృగ వాంఛలతో (2)
దిగాజారితి చావునకు
||ప్రభు యేసుని||
యేసు నీ రాజ్యములో - భువి కేతెంచెడి రోజు (2)
ఈ పాపిని క్షమియించి - జ్ఞాపకముతో బ్రోవుమని (2)
ఇల వేడితిని - విలపించుచును (2)
ఈడేరెను నా వినతి
||ప్రభు యేసుని||
పరదైసున ఈ దినమే - నా ఆనందములోను (2)
పాల్గొందువు నీవనుచు - వాగ్ధానము చేయగనే (2)
పరలోకమే నా - తుది ఊపిరిగా (2)
పయనించితి ప్రభు కడకు
||ప్రభు యేసుని||
