ప్రభు యేసుని పూజించెదం
అనుదినము ఘనపరచెదం (2)
కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి (2)
సంతోషముగా ఉండెదం (4)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
||ప్రభు||
జీవమైన యేసు మనకు ఉన్నాడు
జీవజల రుచులు మనకు చూపాడు (2)
మన పాపం తీసాడు - మనశాంతి నిచ్చాడు (2)
||హల్లెలూయా||
ఆరిపోయిన దివిటీలు వెలగాలి
అందరూ ఆత్మతో నిండాలి (2)
ఏ జామో ఘడియో - రారాజు రానుండె (2)
||హల్లెలూయా||
