Good Friday

ప్రభు యేసు ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను

Prabhu Yesu Prabhu Yesu Adigo Shrama Nondenu

Watch on YouTube
ప్రభు యేసు.. ప్రభు యేసు - అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించెను సిలువలో ||ప్రభు యేసు|| ఎంత కౄరమో.. ఎంత కౄరమో - శత్రు కార్యము చూడుమా అంతగా బాధించి సిలువమీది కెత్తిరి బాధనొందియు.. బాధనొందియు - ఎదురు మాటలాడక ఖైదీలను విడిపించెను సిలువలో (2) ||ప్రభు యేసు|| ముండ్ల మకుటము.. ముండ్ల మకుటము - తన తల నుంచిరి మూర్ఖుల దెబ్బల బాధను సహించెను మూసియుండిన.. మూసియుండిన మోక్షద్వారము తెరచి ఖైదీలను విడిపించెను సిలువలో (2) ||ప్రభు యేసు|| ఆత్మదేవుడు.. ఆత్మదేవుడు - ప్రత్యక్షంబాయె సిలువలో సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి సార్వత్రికము.. సార్వత్రికము - గడగడ వణికెను ఖైదీలను విడిపించెను సిలువలో (2) ||ప్రభు యేసు|| మరణించెను.. మరణించెను - సమాధి నుంచబడెను మూడవనాడు సమాధినుండి లేచెను విడిపించెను.. విడిపించెను మరణ బంధితులను ఖైదీలను విడిపించెను సిలువలో (2) ||ప్రభు యేసు|| తీసివేసెను.. తీసివేసెను - నా పాప నేరమంతయు దేవయని ప్రభు అరచిన యపుడు దేవుని దయ.. దేవుని దయ - కుమ్మరించబడెను ఖైదీలను విడిపించెను సిలువలో (2) ||ప్రభుయేసు|| కారు చీకటిలో.. కారు చీకటిలో - దుఃఖంబులో నేనుంటిని నీకువేరుగా నారక్షణిల లేదుగా నాదు శ్రమలు.. నాదు శ్రమలు - వేరెవ్వరు నెరుగరు ఖైదీలను విడిపించెను సిలువలో (2) ||ప్రభు యేసు||