Good Friday
ప్రభు యేసు ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను
Prabhu Yesu Prabhu Yesu Adigo Shrama Nondenu
ప్రభు యేసు.. ప్రభు యేసు - అదిగో శ్రమ నొందెను
ఖైదీలను విడిపించెను సిలువలో
||ప్రభు యేసు||
ఎంత కౄరమో.. ఎంత కౄరమో - శత్రు కార్యము చూడుమా
అంతగా బాధించి సిలువమీది కెత్తిరి
బాధనొందియు.. బాధనొందియు - ఎదురు మాటలాడక
ఖైదీలను విడిపించెను సిలువలో (2)
||ప్రభు యేసు||
ముండ్ల మకుటము.. ముండ్ల మకుటము - తన తల నుంచిరి
మూర్ఖుల దెబ్బల బాధను సహించెను
మూసియుండిన.. మూసియుండిన మోక్షద్వారము తెరచి
ఖైదీలను విడిపించెను సిలువలో (2)
||ప్రభు యేసు||
ఆత్మదేవుడు.. ఆత్మదేవుడు - ప్రత్యక్షంబాయె సిలువలో
సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి
సార్వత్రికము.. సార్వత్రికము - గడగడ వణికెను
ఖైదీలను విడిపించెను సిలువలో (2)
||ప్రభు యేసు||
మరణించెను.. మరణించెను - సమాధి నుంచబడెను
మూడవనాడు సమాధినుండి లేచెను
విడిపించెను.. విడిపించెను మరణ బంధితులను
ఖైదీలను విడిపించెను సిలువలో (2)
||ప్రభు యేసు||
తీసివేసెను.. తీసివేసెను - నా పాప నేరమంతయు
దేవయని ప్రభు అరచిన యపుడు
దేవుని దయ.. దేవుని దయ - కుమ్మరించబడెను
ఖైదీలను విడిపించెను సిలువలో (2)
||ప్రభుయేసు||
కారు చీకటిలో.. కారు చీకటిలో - దుఃఖంబులో నేనుంటిని
నీకువేరుగా నారక్షణిల లేదుగా
నాదు శ్రమలు.. నాదు శ్రమలు - వేరెవ్వరు నెరుగరు
ఖైదీలను విడిపించెను సిలువలో (2)
||ప్రభు యేసు||
