Prayer

ప్రార్థన వలనే పయనము

Praardhana Valane Payanamu

Watch on YouTube
ప్రార్థన వలనే పయనము - ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము - ప్రార్థన లేనిదే పరాజయం (2) ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2) నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా (2) ||ప్రార్థన|| ప్రార్ధనలో నాటునది - పెల్లగించుట అసాధ్యము ప్రార్ధనలో పోరాడునది - పొందకపోవుట అసాధ్యము (2) ప్రార్ధనలో ప్రాకులాడినది - పతనమవ్వుట అసాధ్యము (2) ప్రార్ధనలో పదునైనది - పనిచేయకపోవుట అసాధ్యము (2) ||ప్రభువా|| ప్రార్ధనలో కనీళ్లు - కరిగిపోవుట అసాధ్యము ప్రార్ధనలో మూల్గునది - మరుగైపోవుట అసాధ్యము (2) ప్రార్ధనలో నలిగితే - నష్టపోవుట అసాధ్యము (2) ప్రార్ధనలో పెనుగులాడితే - పడిపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||